ప్రకాశం: కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం మొత్తం చిత్తడిగా మారిపోవడంతో మృతుడు ఎవరనేది తెలియరాలేదు. ఏదైనా వాహనం ఢీకొట్టిందో తెలియాల్సి ఉంది.