TG: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్, ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అపరిశుభ్ర వాతావరణం, కుళ్లిపోయిన ముడిపదార్థాలతో యథేచ్చగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్నారు. తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. కల్తీ అల్లం పేస్ట్‌ను అధికారులు మూసీలో పారబోశారు.