అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద ఉన్న చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ మృతి చెందాడు. సోమవారం 10వ తరగతి పరీక్ష రాసి స్నేహితులతో కలిసి చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ నీట మునిగి చనిపోయాడు. అతడికి ఫీట్స్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతపురం రూరల్ పరిధిలోని కొట్టాలలో వారి కుటుంబం నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.