KDP: చాపాడు సమీపంలోని అల్లాడుపల్లె క్రాస్ రోడ్ వద్ద శనివారం సాయంత్రం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లక్ష్మీపేటకు చెందిన గురు మహేశ్వర్ రెడ్డి, సీతారామపురానికి చెందిన ఓబుల్ రెడ్డికి గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు నుంచి సీతారామపురం రోడ్డు వైపు బైకుపై తిరుగుతుండగా, ఇదే క్రమంలో వెనక వైపు నుంచి వస్తున్న మహేశ్వర్ రెడ్డి బైకు ఢీకొంది. ఇరువురికి గాయాలయ్యాయి.