హన్మకొండ: బైకు అదుపు తప్పి తండ్రి, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కాజీపేట మండలం కడిపికొండ శివారు గృహకల్పవద్ద గురువారం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్పూర్కు చెందిన దేవేందర్ సరిత తండ్రి కూతురు తమ బైకుపై వరంగల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై గుంతలు పడి కంకర తేలివుండడంతో బైకు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో తండ్రి, కూతురుకి తీవ్ర గాయాలయ్యాయి.