మేడ్చల్: జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీనగర్ మార్కెట్ లేన్లో కాటి నర్సింహా భార్య సుమలత, ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను చూసేందుకు ఇటీవల సుమలత తల్లి పుల్లమ్మ ఇంటికి వచ్చింది. స్నానం చేయడానికి వేడి నీళ్లు పెట్టగా బన్నీ(4) ఆడుకుంటూ అందులో పడిపోయి మృతి చెందాడు.