KDP: తమిళనాడులోని రాణిపేట వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. కడప జిల్లా వేపరాల గ్రామానికి చెందిన బడి గింజల నాగేంద్ర, గంజికుంట శేషయ్యలు అరుణాచలం దర్శనానికి బైక్పై వెళ్తుండగా రాణిపేటలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఇద్దరు కిందపడగా మరో కారు వారిపై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.