KDP: తాళం పగలగొట్టి 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన బద్వేలు పట్టణంలోని రిక్షా కాలనీలో బుధవారం జరిగింది. పోలీసుల వివరాలు మేరకు కాలనీకి చెందిన ప్రభావతి ఇంటికి తాళం వేసి పని నిమిత్తం టౌన్లోకి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉంది. బీరువా పరిశీలించగా బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు గుర్తించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.