AP: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో భారీ చోరీ జరిగింది. శ్రీదేవి అనే మహిళ ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా దుండగులు ఆమె బ్యాగులో ఉన్న 15 తులాల బంగారాన్ని అపహరించారు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును కమలాపురం పీఎస్కు తరలించారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అనుమానితుల కోసం ఆరా తీస్తున్నారు.