NRML: నిద్రమత్తులో టోల్ ప్లాజా డివైడర్‌ను లారీ ఢీకొన్న ఘటన శుక్రవారం అర్ధరాత్రి సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద జరిగింది. స్థానికుల వివరాల మేరకు అమరావతి నుండి ఓ లోడుతో వస్తున్న(TN 28 BX 6935)టోల్ ప్లాజా వద్దకు రాగానే డివైడర్‌ను ఢీ కొట్టిందని, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SKLM: ప్రయాణించిన బస్సు కిందనే పడి ఒకరు మృతి చెందిన ఘటన రాజాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజాం బస్టాండ్‌లో బురాడ గ్రామానికి చెందిన రాజు శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సులో రాజాం చేరుకున్నాడు. బస్సు నుండి దిగుతుండగా అదుపుతప్పి అదే బస్ టైర్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
KDP: పెండ్లిమర్రి మండల పరిధిలోని కొండూరు గ్రామంలో మణికంఠ అనే యువకుడు శుక్రవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. తన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తూ షాక్‌కు గురై చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేశారు.
NDL: బనగానపల్లె మండలం, దద్దనాల కాలువ దగ్గర తెల్లవారుజామున రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని స్వగ్రామం కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాగా పోలీసులు గుర్తించారు. మరొక లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
HYD: ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రేవంత్ (25) అమీర్‌పేట్‌లో టెక్నికల్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం అవుషాపూర్ సమీపంలో షిర్డీ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
NLR: బాలయపల్లి మండలం పెరిమిడి గ్రామ సమీపంలో సిమెంట్ బస్తాలతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం ప్రకారం కలవకూరు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనుల కోసం సిమెంట్ తరలిస్తున్న వాహనం పెరిమిడి గ్రామ సమీపంలో భారీ గుంతలను తప్పించబోయి ప్రమాదానికి గురైందని తెలిపారు.
ATP: గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో శుక్రవారం రాత్రి ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనాలు తనిఖీల్లో భాగంగా లైసెన్సు లేని 20 వాహనాలకి జరిమానా విధించారు. ప్రతి ఒక్క వాహనదారుడు వాహన పత్రాలను తమ దగ్గర ఉంచుకోవాలని, లేకుంటే తగిన చర్యలు చేపడతామని తెలిపారు.
అన్నమయ్య: ఆటో బోల్తా పడి ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు శుక్రవారం గుర్రంకొండ ఎస్సై మధు రామచంద్రుడు తెలిపారు. కదిరాయచెరువుకు చెందిన ఓ ఆటోడ్రైవర్ గుర్రంకొండ నుంచి తన ఆటోలో ప్రయాణికులతో బయలుదేరాడు. మార్గమధ్యలో సరిమడుగు క్రాస్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దిగువ సరిమడుగుకు చెందిన రైతు రెడ్డప్ప(70)తో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు.
PLD: నరసరావుపేట మండలం గురవాయపాలెం ఎస్సీ కాలనీలో భార్యను చంపి ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా భర్త నమ్మించే ప్రయత్నం చేసిన ఉదంతం శుక్రవారం జరిగింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. భార్యపై అనుమానంతో భర్త రమేష్ కొట్టి చంపాడని, అనంతరం నైలాన్ తాడుతో ఉరి వేశాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
BHPL: కాటారం మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన డొంగిరి బుచ్చయ్య (55)కు మరో వ్యక్తితో ఈ మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ ఏర్పడి కర్రలతో దాడి చేసుకోగా.. బుచ్చయ్య తలకు తీవ్ర గాయమైంది. దీంతో బుచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
దిగ్గజ వాహన తయారీ సంస్థ ‘సుజుకీ మోటార్ కార్పొరేషన్’ మాజీ ఛైర్మన్ ‘ఒసాము సుజుకి’ కన్నుమూశారు. జపాన్‌లోని గెరోలో 1930లో జన్మించిన ఒసాము.. సుజుకి వ్యవస్థాపక కుటుంబంలో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. తన భార్య ఇంటిపేరుపై ‘కార్లు’ పరిచయం చేసి దాన్నే బ్రాండ్‌గా మార్చారు.
AP: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి పార్శిల్ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో తులసి మరిది శ్రీధర్ వర్మను కుట్రదారుడిగా గుర్తించారు. శ్రీధర్‌కు ఆయన ఇద్దరు భార్యలు రేవతి, విజయలక్ష్మీ సహకరించారు. తండ్రి రంగరాజు ఆస్తిలో తులసి, రేవతి మధ్య విభేదాలు తలెత్తాయి. మృతదేహంతో తులసిని భయపెట్టి.. ఆస్తి జోలికి రాకుండా చేయడమే శ్రీధర్ పన్నాగమని SP నయీం తెలిపారు.