VZM: విజయనగరం జిల్లా కోరుకొండ-జొన్నవలస మధ్యలో గల రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు జీఆర్పీ ఎస్ఐ వి. బాలాజీరావు శనివారం తెలిపారు. మృతుని వయసు సుమారు 55-60 మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు విజయనగరం జీఆర్పీ పోలీసు స్టేషన్ను సంప్రదించాలని కోరారు.
BPT: బల్లికురవ మండలంలోని ఈర్లకొండ సమీపంలో గ్రానైట్ లారీ మరమ్మతులకు గురికావడంతో రోడ్డుపై నిలిపారు. అదే దారిలో బైక్పై వెళ్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TPT: వరదయ్యపాలెం మండలం కారిపాకంలో గంజాయి అమ్ముతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మల్లికార్జున్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. పక్కా సమాచారంతో దాడి చేసి రూ.72 వేలు విలువైన 6 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు విఘ్నేష్, అరసు, అజిత్ కుమార్, నరేంద్ర, సురేశ్, రాజాను రిమాండ్కు తరలించామన్నారు.
ELR: టి.నర్సాపురం మండలం వెలగపాడు శివారులో శనివారం రాత్రి దారుణం జరిగింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో భార్య శ్రావణి (23)ను భర్త రాము హత్య చేశాడు. తలపై కర్రతో దాడి చేయడంతో ఆమె ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొని డీఎస్పీ రవిచంద్ర, ఎస్ఐ చెన్నారావు దర్యాప్తు చేస్తున్నారు.
కడప: ఆదర్శ స్కూల్ పిల్లలను ఇంటికి తరలిస్తున్న ఆటో పరసతోపు వద్ద బోల్తా పడి 8మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గుండ్లపల్లికి చెందిన విద్యార్థులు ఆదర్శ స్కూల్లో చదువుతున్నారు. సాయంత్రం స్కూల్ వదలగానే ఆటోలో ఇంటికి వెళుతుండగా, పరసతోపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడ్డవారిని మదనపల్లెకి తరలించారు.
NLG: గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామానికి చెందిన కిరణ్ అనే 10వ తరగతి విద్యార్థి శనివారం ఇంటి పైన ఫోన్ మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలను తెలుసుకున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోయారు.
కోనసీమ: ఆత్రేయపురం లొల్ల నుండి ఆత్రేయపురం వైపు వెళ్లే రహదారిలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్ బైక్ను ఢీకొనడంతో ఇరువురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షత్రగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ATP: తాడిపత్రి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణములో నివాసముండే కంబగిరి అనే భవన నిర్మాణ కార్మికుడు శనివారం ఇంటి నిర్మాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు కంబగిరి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
KMR: కడుపు నొప్పి భరించలేక మహిళ పురుగుల మందు సేవించి ఈనెల 12న ఆత్మహత్యాయత్నం చేస్తుందని ఎస్ఐ రంజిత్ తెలిపారు. సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన కోరబోయిన రాజమణి(57) మహిళ పురుగుల మందు సేవించగా ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే నిజాంబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.
AP: కడప టీడీపీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మృతిచెందాడు. హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా ఎమ్మెల్సీ కుమారుడు విష్ణుస్వరూప్ మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: కుల్సంపుర పోలీసులు ఘరానా దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ నెల 24న జియాగూడ 100 ఫీట్ రోడ్డు వద్ద బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని ముగ్గురు అడ్డుకుని, అతడిపై దాడి చేసి ఆయన బైక్తో పరారయ్యారు. బాధితుడు కుల్సంపుర పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
MDK: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఎల్దుర్తి మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన సుల్తాన్ అవసర నిమిత్తం తన బైక్పై కుకునూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా, మార్గమధ్యలో వాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కాగా, స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
MDK: ఆందోల్ పెద్ద చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. చెరువులో మృతదేహం తేలినట్లు స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న జోగిపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మత్స్యకారుల సహాయంతో చెరువులో నుంచి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. మృతుడి పూర్తి వివరాల కోసం జోగిపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
KDP: ముద్దనూరు పట్టణంలోని ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్న రైల్వే ట్రాక్ పై శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మరణించిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మృతి చెందిన వ్యక్తి ముద్దనూరు మండలం ఆరవేటిపల్లె గ్రామానికి చెందిన మూరబోయిన మనోజ్గా గుర్తించారు. మృతికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
సత్యసాయి: మడకశిర మండలం సిద్ధగిరి గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడి రెండు పాడి గేదెలు మృతి చెందాయి. బాధిత రైతు మాట్లాడుతూ.. పాడి గేదెలు పోషిస్తూ జీవనం కొనసాగిస్తున్నానని అయితే ప్రమాదవశాత్తు తీగలు పడి రెండు పాడి గేదలు మృతి చెందాయని, దీంతో సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపాడు.