WNP: షార్ట్ సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం అల్వాల గ్రామానికి చెందిన హరికృష్ణకు చెందిన పూరిగుడిసె విద్యుతాఘాతం వల్ల పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రూ.2 లక్షల నగదు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు వాపోయాడు.
HYD: వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని సొంత అక్కని ప్రియుడి సహాయంతో చెల్లి హతమార్చింది. రైల్వే ఉద్యోగి లక్ష్మీకి అరవింద్‌తో వివాహేతర సంబంధం ఉంది. లక్ష్మీ రైల్వే క్వార్టర్స్‌లో తన అక్క జ్ఞానేశ్వరి (మతిస్థిమితం సరిగా లేదు)తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉందని ఇద్దరు కలిసి జ్ఞానేశ్వరిని హత్య చేసి ఒక గుంతలో వేసి చెత్తాచెదారాన్ని కప్పివేశారు.
JGL: జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌లో శుక్రవారం గ్యాస్ సిలిండర్ పేలి పెను ప్రమాదం తప్పింది. మదర్ సా – అరాబిక్ పాఠశాల ముందు ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదం జరిగింది. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో వస్తువులు కాలిపోయి ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.
ASR: రాజవొమ్మంగి మండలం వట్టిగడ్డ గ్రామానికి చెందిన ఉపాధి కూలి బి.కొండమ్మ శుక్రవారం ఉదయం గాయపడింది. తంటికొండ గ్రామంలో చెరువు పూడికతీత పని చేస్తుండగా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఆమెకు చేతికి తీవ్రమైన గాయమైంది. ఆమె బంధువులు అందుబాటులో లేకపోవడం ఫీల్డ్ అసిస్టెంట్ మంగారాజు, తోటి కూలీలు రాజవొమ్మంగి ఆసుపత్రి తరలించగా వైద్య సహాయం అందజేశారు.
GNTR: నగరంలో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విద్యానగర్‌కు చెందిన సత్యన్నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది. రూ. 70 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 2లక్షల నగదును దొంగలు చోరీ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని అవలోన్ విమానాశ్రయంలో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న విమానంలోని ఓ 17 ఏళ్ల బాలుడు ఎక్కాడు. విమానంలోకి ఆ బాలుడు లోడింగ్ గన్ తో ఎక్కాడు. అతడు గన్ బయటకు తీయగానే విమానంలోనే ఉన్న మాజీ బాక్సర్ భారీ క్లార్క్ అప్రమత్తమై నిలవరించాడు. మాజీ బాక్సర్ చాకచక్యంతో ముప్పు తప్పింది. విమానాశ్రయం కంచెలో దూరి బాలుడు విమానం ఎక్కడని పోలీసులు తెలిపారు.
MNCL: వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య SI సురేశ్ వివరాల ప్రకారం.. రాపల్లికి చెందిన లావణ్య మంగళవారం పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆమెను చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం HYDకి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కాగా ఆమె భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించారని తండ్రి ఫిర్యాదు చేసినట్లు SI వెల్లడించారు.
KKD: తాళ్లరేవు మండలం సీతారామపురంలో కోరంగి పోలీసులు ఐదు కిలోల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? తదితర వివరాలు సేకరించిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
NLR: మనుబోలు మండల పరిధి అప్పయ్యగేటు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదే మార్గంలో ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొని పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డైవర్‌తో సహా పలువురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ట్రాఫిక్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
NZB: నగరంలో మంగళవారం కత్తిపోట్ల కలకలం చెలరేగింది. నగరంలోని గాజుల్ పేట్లో ఓ సంఘం సమావేశంలో జరిగిన పరస్పర వాదనలు కాస్తా కత్తిపోట్లకు దారితీసాయి. సంతోష్ అనే వ్యక్తిని ఒకరు కత్తితో పొడిచి గాయపరిచాడు. కత్తిపోట్లలో గాయపడిన క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: టిప్పర్‌ను ఓ ట్రావెల్ బస్సు ఢీకొట్టిన సంఘటన వెంకటాచలం మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. దీంతో పక్కనే ఉన్న పొలాల్లోకి బస్సు దూసుకెళ్లింది. బస్సులో ఉన్న వారికి ఏం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
SRPT: జిల్లా కేంద్రంలోని 19 వ వార్డు విజయ కాలనీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర జాతీయ రహదారి 65 పై రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం పల్లె వెలుగు బస్సు, రోడ్డు రోలర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TPT: నగరంలోని గరుడ వారిది ఫ్లైఓవర్ పై మంగళవారం తెల్లవారుజామున బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్ వేగంగా వెళ్లి గోడను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో రుయా ఆసుపత్రికి తరలించారు.
SRD: వారం రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు మంజీరా నదిలో దూకి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నాగల్గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామానికి చెందిన సునీల్ చౌహన్(22) గత నెల 28న హైదరాబాద్ నుంచి పల్సర్ బండిపై ఇంటికి బయలుదేరాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్లో సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు. యువకుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ASF: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన పెంచికల్పేట్ మండలంలోని లోడ్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్ల లలితను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ఆమె భర్త గణేశ్ తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.