WGL: నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామంలో గత రాత్రి గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు. గ్రామంలోని బెల్లం ఎంకన్న అనే రైతుకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడిచేయగా 5 గొర్రెలు మృతి చెందాయని వాపోయాడు. రూ.70 వేల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.
E.G: రాజవొమ్మంగిలోని శరభవారం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి కే.అఖిల్ వెంకట సాయి బూదరాళ్ల గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. లంబసింగి చూసేందుకు బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా ఘాట్ రోడ్డులో బైక్ బోల్తా కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. నర్సీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.
రాజస్థాన్ బికనేర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మందుగుండు సామగ్రి పేలి ఇద్దరు ట్రైనీ జవాన్లు దుర్మరణం చెందారు. వాహనంలోకి మందుగుండు సామగ్రిని ఎక్కిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: వనపర్తి జిల్లా పెబ్బేరు దగ్గర జాతీయ రహదారి 44పై దారి దోపిడీ జరిగింది. ఆగి ఉన్న కారుపై దొంగలు రాళ్లు, కర్రలతో దాడి చేసి కారులో ఉన్న మహిళల నుంచి 14 తులాల బంగారం చోరీ చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు జగిత్యాల జిల్లా కొత్తూరువాసులు కాగా, తిరుపతికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు ...
ప్రకాశం: దర్శిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు దర్శి మార్కెట్ యార్డ్ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులు ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటన స్ధాలని చేరుకుని దర్యాప్తు చేశారు.
GDWL: జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో ట్రాక్టర్ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. బుధవారం అయిజ చిన్న తాండ్రపాడు చెరువులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ భాను తృటిలో తప్పించుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తమిళనాడులోని తేని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీలారీని అయ్యప్ప భక్తుల కారు ఢీకొట్టటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
శ్రీకాకుళం జిల్లాలో సైబర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా లోన్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ లింక్ వంటి వాటిపై ఫైబర్ నేరాలు శ్రీకాకుళంలో ఎక్కువగా నమోదవుతున్నాయని డీఐజీ బుధవారం తెలిపారు. ఎప్పటికీ దాదాపు 19 కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అనుమానం ఉన్న వ్యక్తులపై 1930కి ఫోన్ చేయాలని సూచించారు.
ప్రకాశం: పెద్దదోర్నాల, శ్రీశైలం అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న కారును తప్పించే క్రమంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పరుచూరుకు చెందిన శేషారావు, నాగూర్ సాహెబ్‌కు కాళ్లు విరిగాయి. వారిని 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KRNL: గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ సమీపంలో ప్రేమ జంటపై కొందరు యువకులు నిన్న వేటకొడవళ్లతో దాడి చేశారు. యువతి తప్పించుకొని పారిపోగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మిగనూరుకు చెందిన అరవింద్, ఓ యువతి ప్రేమలో ఉన్నారు. నిన్న ఇరువురూ LLC కాలువ వద్దకు చేరుకుని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు వారిపై దాడి చేశారు.
SRCL: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వేములవాడ మండలం నూకలమర్రిలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నూకలమర్రికి చెందిన రషీద్‌ను తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా తెలిపారు. రషీద్ గంగాధర మండలంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివర...
ELR: అనుమానంతో భర్త భార్యను కడతేర్చిన ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సగ్గురులో చోటుచేసుకుంది. లాము రమేష్ భార్య మనీషా (27) వీరికి 10 ఏళ్ల కిందట వివాహమైంది. అయితే ఇటీవల తరచూ వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా సోమవారం మరోసారి గొడవ జరిగింది. దీంతో రమేష్ మనీషా గొంతు నులిమి చంపేసాడు. ఈ ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
కృష్ణా: ఆగిరిపల్లి మండలం సగ్గూరు గ్రామంలో అనుమానం పెనుభూతమై భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కార్మికుడు లాము రమేశ్ తన భార్య మనీషా (27)ను గొంతు నులిమి హత్య చేసినట్లు ఎస్సై శుభ శేఖర్ తెలిపారు. సోమవారం జరిగిన ఘటన మృతురాలి అన్న యేసురత్నం తెలుసుకొని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
NLR: సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు వైపు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న సిమెంటు లారీ.. బద్వేల్ నుంచి నెల్లూరుకి వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే 108లో ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు.
కృష్ణా: విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. గొర్రెల అజయ్ మంగళవారం అర్ధరాత్రి బుడమేరు బస్టాండ్ వద్ద బైకుపై వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అజయ్ స్నేహితులకు సమాచారం అందించి, ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని స్నేహితులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.