SKLM: టెక్కలి మండలం సుఖదేవుపేట గ్రామానికి చెందిన బీ.నారాయణరావు అనే వృద్ధుడిపై గురువారం వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రామంలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆయనపై కుక్క దాడి చేసిందని కుటుంబసభ్యులు తెలిపారు. వృద్ధుడిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల వీధి కుక్కల దాడులు ఎక్కువయ్యాయని స్థానికులు వాపోతున్నారు.