NTR: బాలిక ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆర్టీసీ కాలనీకి చెందిన 14 సంవత్సరాల విద్యార్థిని ఓ ప్రైవేట్ స్కూల్లో 10th చదువుతోంది. బుధవారం సెలవు కావడంతో ఇంటి వద్దే ఉంది. తల్లిదండ్రులు బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.