NLR: సోమశిల జలాశయానికి వరద తగ్గుముఖం పట్టినట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 2,577 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 71.923 టీఎంసీల నీటిమట్టం నమోదయింది. పెన్నా డెల్టాకు 1500 క్యూసెక్కులు, కండలేరుకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.