ELR: ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి వద్ద ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఘంటశాలకు చెందిన భాను ప్రకాశ్, గౌతమ్, వెంకట సాయి, చల్లపల్లికి చెందిన భార్గవ్, తేజలు విజయవాడ నుంచి కారు అద్దెకు తీసుకుని మారేడుమిల్లి విహార యాత్రకు బయలు దేరారు. నాగులపల్లి వద్ద బుధవారం ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది.