ELR: విద్యుత్ ఘాతకానికి గురై మహిళ మృతి చెందిన ఘటన కామవరపుకోట మండలం వడ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్వరి ఇంటి లోపల బీరువాలో బ్యాగ్ పెడుతుండగా బీరువాకు విద్యుత్ వైర్లు తగిలి షాక్‌కు గురై మృతి చెందింది. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాదముద్రలు సేకరించి ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం మంగంపేట మండలంలోకి పెద్దపులి ప్రవేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
TPT: తిరుపతి బస్టాండ్ సమీపంలో వ్యభిచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు(D) పొదలకూరు(M) డేగపూడికి చెందిన గోవర్ధన్ రెడ్డి, అనంతమడుగు వాసి మద్దాలి వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తికి చెందిన గుడాల గురవయ్య జయశ్యాం థియేటర్ వీధిలోని లాడ్జిలో గది తీసుకున్నారు. అక్కడ ఓ మహిళను ఉంచి వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా సమాచారంతో తిరుపతి పోలీసులు దాడి చేశారు.
VSP: మాకవరపాలెం మండలం కోడూరులో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. గ్రామానికి చెందిన వేగి పైడమ్మ ఇంటి వద్ద రోజూ స్థానికులు కూర్చుని మాట్లాడుకుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఈ గోడవద్ద మాట్లాడుకుంటున్న కోయిలాడ కాంతం (73), వేడి భీముడు(70) లపై గోడ కూలిపోయింది.
విశాఖ హనిట్రాప్ కేసులో బాధితుడి తల్లి మంగళవారం విశాఖలో ప్రెస్‌మీట్ పెట్టింది. తమ బిజినెస్ ప్రోమోట్ చేస్తానని జాయ్ జమియా తన కుమారిడితో పరిచయం పెంచుకుందని తెలిపింది. అమెరికా నుంచి అతనిని వైజాగ్కిి రప్పించిన ఆమె.. జ్యూస్‌లో మత్తు మందు కలిపి పెట్టిన ఇబ్బందులను వాయిస్ మెసేజ్ ద్వారా తమకు తెలియజేశాడని పేర్కొంది.
ATP: రాప్తాడు రైల్వేగేట్ దగ్గర ఒక తోటలో భారీగా గోవా మద్యం డంపు దొరకడంపై ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామితో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. అసలు గోవా నుంచి మద్యం ఎలా వచ్చింది. ఇక్కడ ఎవరు డంప్ చేశారో వివరాలు వెల్లడించాలని అధికారులను కోరారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలంలోని కోలమూరు గ్రామం జాతీయ రహదారి వంతెన దిగువన ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది మంగళవారం రూట్ వాచ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆటోలో తనిఖీలు నిర్వహించగా 10 కిలోల గంజాయిని గుర్తించి, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు వారిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు తెలిపారు.
W.G: పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో మంగళవారం పేకాట స్థావరాలపై ఇన్చార్జ్ ఎస్సై జేవీఎన్. ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. ఈ సందర్భంగా 12 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1,01,650లు నగదు, పది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. హెచ్.సీ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ అడ్డా శ్రీనివాస్ పాల్గొన్నారు.
VZM: గంట్యాడ పోలీసులు మంగళవారం కోడి పందాల స్దావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు.ఈ మేరకు మండలంలో చినమధుపాడలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, కోడిపందాలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకుని వారి నుంచి రెండు కోడిపుంజులు, వెయ్యి రూపాయల నగదు, 7 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడి వారిపై పై కేసు నమోదు చేశారు.
కడప: కొండాపురం మండలంలోని బ్రాహ్మణపల్లి బస్టాప్ వద్ద మంగళవారం లారీ, బైక్ ఢీకొని ఒకరికి గాయాలయ్యాయి. తాడిపత్రి నుంచి కొండాపురం వైపు వస్తున్న బైక్ ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టుకోవడంతో బైక్‌పై ఉన్న బింగి తిరుపాల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించారు. తిరుపాల్ ఏటూరు గ్రామానికి చెందినవాడు. గత కొంతకాలంగా తాడిపత్రిలో నివాసం ఉంటున్నాడు.
VZM: నెల్లిమర్ల మండలంలోని ఒమ్మి గ్రామంలో మంగళవారం వేకువజామున పురిళ్లు దగ్ధమైంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాడుగుల గురువులు అనే వృద్ధుడు ఒంటరిగా పురి పాకలో నివాసం ఉంటున్నాడు. వేకువజామున ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇంట్లో నిద్రిస్తున్న గురువులు తేరుకొని తప్పించుకొని బయటకి వచ్చాడు.
AP: వైసీపీ నేత సజ్జల రామ కృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. సజ్జలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది.
AP: విశాఖపట్నంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. విశాఖకు చెందిన మహిళ నిన్న రాత్రి తలకు గాయమై స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లింది. దీన్ని అదునుగా భావించిన స్కానింగ్ సెంటర్ ఇంఛార్జి ప్రకాష్ దుస్తులు తీయాలని చెప్పి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ కేకలు వేయడంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
NRPT: గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. కోస్గి మండలం గుండుమాలకు చెందిన ఫయాజ్ అలీ మేకల మందపై రోజు రాత్రి గుండుమాల్- పగిడిమాల్ ప్రాంతంలో చిరుత దాడి చేసి, ఓమేకను ఎత్తుకెళ్లి సమీపంలోనే చంపేసింది. గ్రామస్థులు FSO, FRO లక్ష్మణ్ నాయక్‌కు సమాచారం ఇవ్వంగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి దాడి చేసింది చిరుతే అని నిర్ధారించారు.
TG: హైదరాబాద్‌లో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి 600 గ్రాముల డ్రగ్స్‌ను మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడికి డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.