• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

నరసరావుపేటలో వివాహిత అనుమానాస్పద మృతి

PLD: నరసరావుపేట మండలం గురవాయపాలెం ఎస్సీ కాలనీలో భార్యను చంపి ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా భర్త నమ్మించే ప్రయత్నం చేసిన ఉదంతం శుక్రవారం జరిగింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. భార్యపై అనుమానంతో భర్త రమేష్ కొట్టి చంపాడని, అనంతరం నైలాన్ తాడుతో ఉరి వేశాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

December 28, 2024 / 04:00 AM IST

కాటారం మండలంలో వ్యక్తి దారుణ హత్య

BHPL: కాటారం మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన డొంగిరి బుచ్చయ్య (55)కు మరో వ్యక్తితో ఈ మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ ఏర్పడి కర్రలతో దాడి చేసుకోగా.. బుచ్చయ్య తలకు తీవ్ర గాయమైంది. దీంతో బుచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

December 27, 2024 / 08:46 PM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి

దిగ్గజ వాహన తయారీ సంస్థ ‘సుజుకీ మోటార్ కార్పొరేషన్’ మాజీ ఛైర్మన్ ‘ఒసాము సుజుకి’ కన్నుమూశారు. జపాన్‌లోని గెరోలో 1930లో జన్మించిన ఒసాము.. సుజుకి వ్యవస్థాపక కుటుంబంలో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. తన భార్య ఇంటిపేరుపై ‘కార్లు’ పరిచయం చేసి దాన్నే బ్రాండ్‌గా మార్చారు.

December 27, 2024 / 03:21 PM IST

పార్శిల్‌లో మృతదేహం.. వీడిన మిస్టరీ

AP: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి పార్శిల్ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో తులసి మరిది శ్రీధర్ వర్మను కుట్రదారుడిగా గుర్తించారు. శ్రీధర్‌కు ఆయన ఇద్దరు భార్యలు రేవతి, విజయలక్ష్మీ సహకరించారు. తండ్రి రంగరాజు ఆస్తిలో తులసి, రేవతి మధ్య విభేదాలు తలెత్తాయి. మృతదేహంతో తులసిని భయపెట్టి.. ఆస్తి జోలికి రాకుండా చేయడమే శ్రీధర్ పన్నాగమని SP నయీం తెలిపారు.

December 27, 2024 / 03:15 PM IST

లారీ ఢీకొని బాలుడు మృతి

SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే స్వాత్రిక్ అనే 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాలుడిని ఢీ కొట్టి ఆపకుండా లారీ డ్రైవర్ వెళ్ళాడు. వట్టేముల గ్రామంలో ప్రజలు పట్టుకున్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన బాలుడిగా స్థానికులు గుర్తించారు.

December 27, 2024 / 02:32 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కృష్ణా: తోట్లవల్లూరు (మం) బందరు కాలువ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి తోట్లవల్లూరు మండలం పాములలంక గ్రామానికి చెందిన పిల్లి సోమేశ్వరరావుగా (40) గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై అర్జున్ రాజు కేసు నమోదు చేశారు.

December 27, 2024 / 01:36 PM IST

త్రిపురాంతకం వద్ద ప్రమాదం.. వ్యక్తి స్పాటె డెడ్

ప్రకాశం: త్రిపురాంతకం మండలంలోని గణపవరం వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గణపవరం మెట్టవద్ద గల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

December 27, 2024 / 10:25 AM IST

మంచినీటి చెరువులో పడి వ్యక్తి మృతి

W.G: పెంటపాడు ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఉన్న మంచినీటి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన దాడి వెంకటరమణ (40)గా గుర్తించారు. స్థానికంగా అరటి పండ్ల వ్యాపారం చేస్తుంటాడని మృతుని బంధువులు తెలిపారు. ఘటనా స్థలానికి పెంటపాడు ఏఎస్ఐ రాజేంద్ర, కానిస్టేబుల్ శ్రీనివాస్ చేరుకున్నారు.

December 27, 2024 / 10:01 AM IST

మనుబోలు హైవేపై ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

NLR: మనుబోలు మండలం కొమ్మలపూడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గూడూరుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

December 27, 2024 / 09:58 AM IST

నెల్లూరు బస్సులో గంజాయి

నెల్లూరులోని స్టేడియం వద్ద ఉన్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న బస్సు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి తనిఖీలు చేపట్టుగా 12 కిలోల గంజాయి పట్టుబడిందని వెల్లడించారు. వివరాల ప్రకారం ఆరు ప్యాకెట్లలో ప్యాక్ చేశారని సదరు వ్యక్తిని అరెస్టు చేసామన్నారు.

December 27, 2024 / 08:54 AM IST