• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

కడియం జాతీయ రహదారిపై లారీ బోల్తా

E.G: కడియం మండలంలోని పొట్టిలంక గ్రామం వద్ద ఉన్న జాతీయ రహదారి పై గురువారం లారీ బోల్తా కొట్టింది. వాటర్ బాటిల్స్‌తో వెళ్తున్న లారీ.. డ్రైవర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురవ్వడంతో లారీ అదుపు తప్పి నర్సరీలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

December 12, 2024 / 12:25 PM IST

ప్రియుడి వేధింపులతో బాలిక ఆత్మహత్య

AP: ప్రియుడి వేధింపులు తాళలేక మైనర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలం పాచిగుంట గ్రామంలో చోటు చేసుకుంది. 6 నెలల క్రితం మామ కుమారుడితో 17ఏళ్ల బాలికకు కుటుంబ సభ్యలు వివాహం చేశారు. మైనర్ కావడంతో ఇంట్లోనే ఉంచుకుంటున్నారు.అదే గ్రామానికి చెందిన వసంత కుమార్‌తో బాలికకు పరిచయం ఉంది. బాలిక వద్ద నుంచి వసంత కుమార్ రెండు సవర్ల బంగారం తీసుకొని వేధింపులకు గురి చేస్తుండటంతో బావిలో దూకి ఆత...

December 12, 2024 / 11:37 AM IST

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా ఇవాళ అబుజ్హామాద్‌లోని ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పట్టాయి. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కాల్పులు మొదలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 12, 2024 / 11:30 AM IST

కారు బోల్తా ఒకరికి గాయాలు

MBNR: కారు అదుపుతప్పి బోల్తా పడి ఒకరికి గాయాలైన ఘటన బాలానగర్ మండలం పెద్దరేవల్లి గ్రామ శివారులో గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గౌతం పల్లికి చెందిన హతిరాం నాయక్ షాద్‌నగర్ నుంచి గౌతంపల్లి వెళ్తుండగా..పెద్దరేవల్లి గ్రామ శివారు మోదంపల్లి గేటు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు చెప్పారు.

December 12, 2024 / 11:28 AM IST

గుంటూరులో వ్యక్తి దారుణ హత్య

GNTR: నగర కేవీపీ కాలనీ రోడ్డు భవానిపురం కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి(35) దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. మృతుడి తలపై రాళ్లతో కొట్టినట్టుగా గుర్తించారు. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో 2 రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది అని తెలిపారు.

December 12, 2024 / 11:18 AM IST

హైవేపై కూలిన విమానం

అమెరికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని విక్టోరియా హైవేపై విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే, పలు కార్లు ధ్వంసమైనట్లు తెలిపారు. విమానంలో ఉన్నవారంతా సేఫ్‌గా ఉన్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

December 12, 2024 / 10:01 AM IST

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

MBNR: ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలిలా.. జడ్చర్ల మండలం లింగంపేట మాజీ సర్పంచ్ కృష్ణయ్య గౌడ్ (45) మృతిచెందగా.. ఆగి ఉన్న లారీ ఢీకొని రాంప్రకాశ్, లవకుశ్ మృతి చెందారు. కర్నూల్ జిల్లాకి చెందిన గొడ్డయ్య గౌడ్ పాల పాకెట్ల కోసం వెళ్లి రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనండంతో బుధవారం చనిపోయాడు.

December 12, 2024 / 09:57 AM IST

జిల్లాలో ఘోర ప్రమాదం

NGKL: బిజినపల్లి మండల కేంద్రంలోని లింగమయ్య కాలనీలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బత్తుల రాములు-అనూషల కుమారుడు బత్తుల నితిన్(8) షాప్‌కి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయాలయై అక్కడికక్కడే మృతిచెందాడు.

December 12, 2024 / 09:32 AM IST

షార్ట్ సర్క్యూట్‌తో వ్యక్తి సజీవ దహనం

JGL: మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున గాతం తిరుపతి తన ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ క్రమంలో మంటలు చెలరేగి ఆయన సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. తిరుపతికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

December 12, 2024 / 09:22 AM IST

జగిత్యాల జిల్లాలో వ్యక్తి సజీవదహనం

TG: జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మల్యాల మండలం మ్యాడంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఇల్లు కూలడంతో.. కట్టెలు మీద పడటంతో.. పూర్తిగా కాలిపోయాడు. మృతుడిని గాతం తిరుపతిగా గుర్తించారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేశారు.

December 12, 2024 / 09:10 AM IST

57 గంటల రెస్క్యూ.. కానీ చివరకు..!

ఆడుకుంటూ వెళ్లి పొలంలోని 150 అడుగుల బోరుబావిలో పడిన ఐదేళ్ల బాలుడి కథ విషాదంతంగా ముగిసింది. బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల పాటు శ్రమించినా.. ఫలితం లేకుండా పోయింది. 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. అయితే బాలుడు అపస్మారకస్థితిలో ఉండటంతో.. ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతిచెందాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని దౌస జిల్లాలో...

December 12, 2024 / 09:08 AM IST

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన డీసీఎం

BDK: ట్రాన్స్‌ఫార్మర్‌ను డీసీఎం ఢీకొట్టిన ఘటన మణుగూరు మండలంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మణుగూరులోని విజయనగరం పెట్రోల్ బంక్ సమీపంలో డీసీఎం అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

December 12, 2024 / 08:37 AM IST

కల్వకుర్తిలో భారీగా గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

NGKL: కల్వకుర్తిలో బుధవారం రెండు లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. డీఎస్పీ కార్యాలయ సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా ఉన్న ఆటోను పట్టుకొని తనిఖీలు నిర్వహించారు. నిషేధిత పొగాకు గుట్కా ప్యాకెట్లు లభించినట్లు తెలిపారు.

December 12, 2024 / 08:15 AM IST

పత్తి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

ADB: పత్తి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన గురువారం తెల్లవారుజామున ఆదిలాబాద్ రూరల్‌లో చోటుచేసుకుంది. బోరింగ్ గూడకు చెందిన రైతు కోడప లక్ష్మణ్ తన పత్తిని ట్రాక్టర్లో మార్కెట్ యార్డ్‌కు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో టేమ్రి గూడ బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలవలేదని వెల్లడించారు.

December 12, 2024 / 08:13 AM IST

భార్యను చూడటానికి వెళ్తూ ప్రమాదం

GNTR: మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరేచర్ల-నర్సరావుపేట మార్గంలో వాహనం అదుపు తప్పడంతో మరణించిన వ్యక్తి వివరాలను సేకరించారు. మృతి చెందిన వ్యక్తి సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన నన్నం విజయ్ కుమార్ (35)గా గుర్తించారు. గుంటూరులో హాస్పటల్లో ఉన్న తన భార్య చూడటానికి వెళ్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పి వంతెనలోకి పడటంతో విజయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు.

December 12, 2024 / 07:39 AM IST