• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

వివాహిత ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు

ATP: గుత్తి మండలం టీ.కొత్తపల్లి గ్రామ శివారులో బొగ్గుల బట్టిలో పనిచేస్తున్న సుబ్బమ్మ అనే వివాహిత కుటుంబ సమస్యల కారణంగా విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.

December 10, 2024 / 09:11 AM IST

పేకాట ఆడుతున్న 8 మంది అరెస్ట్

ELR: కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం గ్రామ సమీపంలో పేకాట శిబిరంపై సోమవారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈనాడులో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.23,000 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

December 10, 2024 / 08:57 AM IST

సినిమాకని తీసుకెళ్లి అత్యాచారం

CTR: మాయమాటలతో యువతిపై అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. కార్వేటినగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17)తో యువకుడికి పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో ఆదివారం రాత్రి పళ్లిపట్టులో సినిమా చూడటానికి ఇద్దరూ వెళ్లారు. మార్గమధ్యలో యువకుడు పొలాల్లోకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని యువతి తండ్రికి చెప్పింది. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

December 10, 2024 / 08:07 AM IST

తల్లిని చూసి వస్తుండగా ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి

GNTR: రోడ్డు ప్రమాదంలో గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న షేక్ కాజా మొహిద్దీన్(32) సోమవారం మృతి చెందాడు. వారి బంధువుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లిలోని ఓ ఫైనాన్స్ విభాగంలో కాజా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. పాటిబండ్ల గ్రామంలో తన తల్లిని చూసేందుకు ఆదివారం ఉదయం వచ్చి మొహిద్దీన్ తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

December 10, 2024 / 07:52 AM IST

విజయవాడు – అమరావతి RTCలో మంటలు

కృష్ణా: విజయవాడ నుంచి అమరావతి వెళుతున్న ఆర్టీసీ మెట్రో బస్సులో సోమవారం రాత్రి మంటలు చెలరేగాయి. ప్రయాణికుల వివరాలు.. మందడం సెంటర్ వద్దకు రాగానే బస్సు టైర్ల నుంచి మంటలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేశారు. ప్రయాణికులు భయాందోళనతో బస్సు నుంచి దిగి పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి వేసినట్లు తెలిపారు.

December 10, 2024 / 07:48 AM IST

విషాదం: కారు కొట్టుకుపోయి ఇద్దరు మృతి

AP: కాలువలో కారు కొట్టుకుపోయి ఇద్దరు మరణించిన ఈ ఘటన కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం చింతవారిపేట సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతయ్యారు. దంపతులు తమ ఇద్దరు కుమారులతో విశాఖ నుంచి పోతవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భర్త ప్రమాదం నుంచి బయటపడగా అతని భార్య, పెద్ద కుమారుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో కుమారుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

December 10, 2024 / 07:44 AM IST

నెల్లూరు జిల్లాలో నకిలీ RTOల అరెస్ట్

నెల్లూరు జిల్లాలో నకిలీ అధికారులు పోలీసులకు చిక్కారు. కందుకూరు DSP బాలసుబ్రహ్మణ్యం వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన లతీఫ్, సిరాజ్ నకిలీ ఆర్టీవోల అవతారం ఎత్తారు. నేషనల్ హైవేపై వాహనదారులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్నారు. ఈక్రమంలో ఉలవపాడు మండలం కరేడు ర్యాంపు దగ్గర సోమవారం ఈ ఇద్దరిని ఎస్ఐ అంకమ్మ అరెస్ట్ చేశారు.

December 10, 2024 / 07:19 AM IST

చీమకుర్తిలో మహిళ నుంచి గంజాయి పట్టివేత

ప్రకాశం: చీమకుర్తి పట్టణంలో ప్యాకెట్ల రూపంలో గంజాయిని తీసుకెళ్తున్న మహిళ డి.భాగ్యమ్మను అదుపులోకి తీసుకొని ఆమె నుంచి కేజీన్నర గంజాయిని స్వాధీనపరచుకున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. గంజాయి విక్రయాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

December 10, 2024 / 07:11 AM IST

నలుగురు అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్

అన్నమయ్య: రాయచోటిలో నలుగురు అంతరాష్ట్ర బైక్ దొంగలను అన్నమయ్య జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.65 లక్షలు విలువ చేసే 37 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మదనపల్లి ప్రాంతానికి చెందిన బత్తుల వినోద్‌, మరో ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. బైకులు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి అభినందించారు.

December 10, 2024 / 06:53 AM IST

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు గల్లంతు

కోనసీమ: పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేట వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. నేలపూడి విజయ్ కుమార్ కుటుంబం కలిసి విశాఖపట్నం వెళ్లి పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త విజయ్ కుమార్ కారు డోర్ తీసుకొని నీటిలో నుంచి బయటకు రాగా, భార్య ఉమ, పెద్ద కుమారుడు మనోజ్, రిషి గల్లంతయ్యారు.

December 10, 2024 / 06:43 AM IST

అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలి

VSP: పాడేరు ఏకలవ్య మోడల్ పాఠశాల విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడికి పాల్పడిన ల్యాబ్ ఉద్యోగి అనూజ్ సింగ్ పటేల్ పై ఫోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం గిరిజన సంక్షేమ డీడీ ఎల్. రజనికి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని డిమాండ్ చేశారు.

December 10, 2024 / 06:04 AM IST

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ప్రకాశం: బల్లికురవ మండలం గుంటుపల్లికి చెందిన పూసుకూరి హరిబాబు (39) పొలం పనితో జీవిస్తుండేవాడు. సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు ద్విచక్ర వాహనం మీద వచ్చి తిరిగి నూతన బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా పురుషోత్తమపట్నం క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు.

December 10, 2024 / 05:52 AM IST

దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్

W.G: గత నెల 9 న పాలకొల్లు సూర్య తేజస్సు నగర్‌లో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ కె. రజనీ కుమార్ సోమవారం మీడియాకు తెలిపారు. వారి వద్ద నుంచి లక్ష విలువ చేసే బంగారు వస్తువులు రికవరీ చేసినట్టు చెప్పారు. గత నెల దొంగతనంలో ఒక ఇంట్లో రూ.2 లక్షలు విలువ చేసే బంగారు వస్తువులు, మరో ఇంట్లో వెండి వస్తువులు దొంగిలించారని తెలిపారు.

December 10, 2024 / 04:33 AM IST

స్కూటీని ఢీకొట్టిన బైక్

ఏలూరు పరిధిలోని వంగాయగూడెంలో సోమవారం ప్రమాదం జరిగింది. స్కూటీని బైక్ ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బైక్ మీద వచ్చిన ముగ్గురు యువకులు పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఏలూరు ఒన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు, ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తీసుకెళ్లినట్లు తెలిపారు.

December 10, 2024 / 04:14 AM IST

తుక్కులూరు రోడ్డు ప్రమాద ఘటనలో మరొకరు మృతి

ELR: నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో నవంబర్ 23వ తేదీ అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతున్న ఊటుకూరి చిట్టిబాబు(32) ఆదివారం ఉదయం మృతి చెందాడు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కటారి కృష్ణ, ఊటుకూరి లక్ష్మిలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన గొల్లపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

December 8, 2024 / 11:02 AM IST