TG: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ శృతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కానిస్టేబుల్ శృతితో పాటు మరో ఇద్దరు చెరువులో దూకినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పీ సింధు శర్మ ఘటనా స్థలానికి చేరుకుని.. ఆత్మహత్య కారణాలపై విచారణ చేస్తున్నారు.