CTR: కానిస్టేబుల్ భార్య సూసైడ్ చేసుకున్న ఘటన నగరంలో బుధవారం చోటుచేసుకుంది. నగరంలోని టి.చవటపల్లెకు చెందిన హేమంత్ చిత్తూరు ఆర్ముడ్ రిజర్వు విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య దేవి(40) గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించారు. బుధవారం మూడోసారి పిచోటపల్లిలోని బావిలో దూకి మృతి చెందింది. ఎస్సై రమేశ్ కేసు నమోదు చేశారు.