ASR: అక్రమంగా తరలిస్తున్న ఆరు టేకు దుంగలను అటవీశాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ట్రక్కు ఆటోపై మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న టేకు దుంగలను దేవీపట్నం మండలం కంబలంపాలెం శివార్లలో పట్టుకున్నారు. వాహనంతోపాటు బొల్లెదుపాలెం తరలిస్తునట్లు ఇందుకూరు ఇన్ఛార్జి సెక్షన్ అధికారి హరీష్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.