TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్దచెరువులో భిక్కనూరు ఎస్సై సాయికుమార్ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే, సాయికుమార్ స్వగ్రామం కొల్చారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై మృతిపై గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాయికుమార్ మృతిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.