ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత పవర్ ప్లాంటులో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణకు ఆదేశించింది.