ఛత్తీస్‌గఢ్‌లోని సక్తీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఓ పవర్‌ప్లాంట్‌లో పేలుడు సంభవించిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.