ATP: అనంతపురానికి చెందిన లోకేశ్(29) హైదరాబాద్ కేపీహెచ్‌బీ పరిధిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఫార్మా కంపెనీలో పనిచేసే యువతితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఆయన, పెళ్లికి సిద్ధమయ్యారు. పెళ్లి దుస్తులు ధరించి, భోజనం తీసుకురావాలని ప్రియురాలిని బయటకు పంపారు. ఆమె తిరిగి వచ్చేసరికి ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.