• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బస్సు ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం

SS: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురికావడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద వివరాలపై అధికారులతో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. బాధితులకు అన్ని సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

March 26, 2026 / 09:50 AM IST

‘బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిద్దాం’

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని TTD JEO వీరబ్రహ్మం అన్నారు. రామయ్య క్షేత్రం కళ్యాణ వేదికలో క్యూలైన్‌ల, భారీ కేడ్లు, గ్యాలరీలు, అన్న ప్రసాదం తయారీ కేంద్రం, విశ్రాంతి భవనం, మాడవీధులు, కాలిబాటల్లో చేపట్టిన ఏర్పాట్లను ముఖ్య భద్రత, నిఘా అధికారి మురళీకృష్ణ, SP విశ్వనాథ్‌తో కలిసి బుధవారం పరిశీలించారు.

March 26, 2026 / 09:44 AM IST

సజ్జపాడు స్మశాన వాటిక సమస్యపై వినతి

NTR: మైలవరం యువత అధ్యక్షుడిగా మూడోసారి నియమితులైన లంక సతీశ్‌ను MRPS ఇంఛార్జ్ శరత్ కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోనే స్మశాన వాటిక లేని గ్రామంగా సజ్జపాడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఈ సమస్యను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన స్మశాన వాటిక మంజూరయ్యేలా కృషి చేస్తానని సతీశ్ హామీ ఇచ్చారు.

March 26, 2026 / 09:43 AM IST

సత్తా చాటిన వారికి రూ. 1.75 లక్షలు.!

CTR: పూతలపట్టు(M)ముతిరేవుల సమీపంలోని SVECలో ఇవాళ హ్యాక్‌థాన్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. మోహన్ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 900 మందికి పైగా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభను కనపరచిన వారికి రూ.1.75 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరుకానున్నారు.

March 26, 2026 / 09:42 AM IST

ఎమ్మెల్యే దృష్టికి పూండి గ్రామ సమస్యలు

SKLM: పూండి గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆమె కార్యాలయంలో బుధవారం సాయంత్రం కలిశారు. ఈ మేరకు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పూండి రైల్వే స్టేషన్‌‌లో పలు రైళ్లకు హాల్ట్ కల్పించాలన్నారు.

March 26, 2026 / 09:41 AM IST

రేపు పెంచలకోనలో శ్రీరామనవమి వేడుకలు

NLR: పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధానంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం నిర్వహించనున్నారు. ఉదయం 8:30 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం, అనంతరం కళ్యాణోత్సవం జరుగుతుందని ఆలయ ఉప కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. సాయంత్రం 6గంటలకు బంగారు హనుమంతు సేవ నిర్వహిస్తామని తెలిపారు.

March 26, 2026 / 09:39 AM IST

మార్కాపురం ప్రమాదం.. ఈ నెంబర్లకు కాల్ చేయండి..!

మార్కాపురం జిల్లాలో టిప్పర్-బస్సు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వారి వివరాలు తెలుసుకోవడానికి ఆర్డీవో ఆఫీస్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఏదైనా సమాచారం కోసం విష్ణువర్ధన్ (6304285613), కిషోర్ (9985733999), రాఘవేంద్ర (7989537285) నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు.

March 26, 2026 / 09:34 AM IST

సాలూరు రూరల్ ఎస్సైగా రవీంద్ర రాజు

PPM: సాలూరు రూరల్ ఎస్సైగా బి. రవీంద్ర రాజు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఇంఛార్జ్ ఎస్సై వెంకటరమణ నుంచి బాధ్యతలు చేపట్టారు. పార్వతీపురం సైబర్ సెల్ విభాగంలో పనిచేసిన రవీంద్రరాజును ఎస్పీ సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలు పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు.

March 26, 2026 / 09:30 AM IST

డాగ్ స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు

SKLM: టెక్కలిలోని బస్ స్టాండ్, దుకాణాలు, పలు ప్రాంతాల్లో పోలీసులు జాగిలాలతో బుధవారం సీఐ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు, తదితర మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

March 26, 2026 / 09:30 AM IST

డ్రగ్ ప్లాన్ ఫెయిల్.. ముగ్గురికి 10 ఏళ్ల జైలు శిక్ష

గుంటూరు: పల్నాడు జిల్లాలకు చెందిన ముగ్గురు స్నేహితులకు హన్మకొండ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆల్ప్రాజోలం మాత్రలతో డ్రగ్ పొడి తయారు చేసి న్యూఇయర్ వేడుకల్లో విక్రయానికి 2023లో హైదరాబాద్ వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నేరం రుజువై వారికి శిక్ష పడినట్లు పోలీసులు వెల్లడించారు.

March 26, 2026 / 09:30 AM IST

ఉరవకొండలో ఆటో బోల్తా.. మహిళ మృతి

ATP: ఉరవకొండ మండలంలోని నింబగల్లు సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో హసీనా (45) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆటోలో 13 మంది కూలీలు ఉండగా, వారిలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 26, 2026 / 09:29 AM IST

ముదిగుబ్బలో కార్డాన్ సెర్చ్ నిర్వహణ

సత్యసాయి: ముదిగుబ్బ మండలంలోని మంగళమడక, ఎన్‌పీ కుంట గ్రామాల్లో గురువారం ఉదయం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా ఉంచి సోదాలు చేపట్టారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలను సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐలు సునీత, శివరాముడు స్పష్టం చేశారు.

March 26, 2026 / 09:27 AM IST

సింహాద్రిపురం వారపు సంత.. ఖరారైన తేదీ

కడప: జిల్లా, పులివెందుల మండలం సింహాద్రిపురం గ్రామపంచాయతీలో వారపు సంత మార్కెట్ వేలం మార్చి 31వ తేదీన నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి యం. సురేష్ బాబు తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ. 2,50,000.00 డీడీ డిపాజిట్ చేయాలి. వేలం ముగిసిన వెంటనే, డీడీ పోను మిగిలిన మొత్తాన్ని చెల్లించి మార్కెట్ రుసుము చేసుకోవాలి.

March 26, 2026 / 09:26 AM IST

ఎమ్మెల్యేపై కలెక్టర్ ప్రశంసల వర్షం

VZM: జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం నెల్లిమర్ల MLA లోకం నాగమాధవిపై ప్రశంసల వర్షం కురిపించారు. రామతీర్థంలో గిరిప్రదక్షిణ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రోడ్డు అంశంలో MLA పాత్ర చాల కీలకమన్నారు. ఆమె కృషి కారణంగా రహదారి పూర్తి అయినట్లు తెలిపారు. రహదారి పూర్తిపై ప్రతి రోజూ వచ్చి తనని కలిసే వారని గుర్తు చేశారు.

March 26, 2026 / 09:22 AM IST

‘అభా యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలి’

ASR: అభా యాప్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు ఓపీ నమోదు కోసం గంటల తరబడి వేచి ఉండకుండా ‘అభా యాప్’ ద్వారా డిజిటల్‌గా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల సమయం ఆదా అవుతుందన్నారు. రోగుల ఆరోగ్య రికార్డులు భద్రంగా ఉంటాయన్నారు. బుధవారం పాడేరు సర్వజన ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు.

March 26, 2026 / 09:20 AM IST