• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతకు జీరో టాలరెన్స్ విధానం

AKP: మహిళల భద్రతకు జీరో టాలరెన్స్ విధానాం ద్వారా నేరగాళ్లలో భయం పుట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రెండు రోజులు పాటు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో హోంమంత్రి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జీరో యాక్సిడెంట్ లక్ష్యంతో పని చేయాలని సీఎం సూచించారన్నారు.

March 13, 2026 / 06:29 AM IST

నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

ప్రకాశం: చీమకుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఇవాళ జరుగుతుందని ఎంపీడీవో రాఘవేంద్ర తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని, మండల స్థాయి అధికారులు అందరూ సమావేశానికి వచ్చేటప్పుడు వారివారి ప్రగతి నివేదికలతో తప్పనిసరిగా హాజరుకావాలని అయన పేర్కొన్నారు.

March 13, 2026 / 06:27 AM IST

ఈనెల 17న జాబ్ మేళా

BPT: చీరాలలో ఈనెల 17న ఎన్ఆర్ అండ్ పీఎం ఉన్నత పాఠశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎమ్మెల్యే కొండయ్య సహకారంతో జరిగే ఈ మేళాకు విద్యార్హత జిరాక్స్ పత్రాలు, ఆధార్, పాస్‌పోర్ట్ ఫొటోలతో హాజరు కావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారిణి ఎం.మాధవి ఒక ప్రకటనలో కోరారు.

March 13, 2026 / 06:20 AM IST

రైల్వే అభ్యర్థులకు ముఖ్య గమనిక

NLR: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్-D పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి పి. వెంకట లక్ష్మి తెలిపారు. BC, SC, ST అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోగా అప్లికేషన్లను తమ ఆఫీసులో ఇవ్వాలని సూచించారు. మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఈనెల 25 నుంచి 2 నెలలపాటు శిక్షణ ఇస్తామన్నారు.

March 13, 2026 / 06:20 AM IST

జనసేన సభ్యత్వాల నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

కోనసీమ: రాజోలు నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాల నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని MLA దేవ వరప్రసాద్ కోరారు. అంతర్వేది పల్లిపాలెం, గొంది గ్రామాల్లో గురువారం ఆయన నాయకులతో చర్చించారు. సభ్యత్వ నమోదు ఉత్సాహంగా జరుగుతోందని, 250 మంది సాధకుల కృషితో లక్ష్యం దిశగా వెళ్తున్నామని చెప్పారు. సభ్యత్వాల నమోదు గడువు పొడిగించారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 13, 2026 / 06:20 AM IST

జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై దృష్టి: కలెక్టర్

W.G: సచివాలయంలో సీఎం అధ్యక్షతన గురువారం జరిగిన రెండో రోజు కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. పర్యాటకాభివృద్ధిపై చర్చ సందర్భంగా.. జిల్లాలో ప్రభుత్వ భూముల కొరతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హోటళ్ల నిర్మాణానికి అనువుగా రెండు చోట్ల R&B స్థలాలను గుర్తించాలని, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైనుకు ప్రతిపాదనలు పంపినట్లు ఆమె వివరించారు.

March 13, 2026 / 06:20 AM IST

పది మద్యం బాటిల్స్ స్వాధీనం

AKP: కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద గురువారం అక్రమంగా తరలిస్తున్న పది మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా తుంపాల గ్రామానికి చెందిన కె. కాశీ విశ్వనాథం మద్యం బాటిల్స్ తీసుకువస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

March 13, 2026 / 06:18 AM IST

నేడు కవయిత్రి మొల్లమాంబ జయంతి

SKLM: కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 10.30గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు . బీసీ సంఘాల నాయకుల సమక్షంలో ఆమె చిత్రపటానికి పుష్పమాలాంకరణ చేసి, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

March 13, 2026 / 06:14 AM IST

నేడు ఎమ్మెల్యే చేతులమీదుగా చెక్కులు పంపిణీ

VZM: చీపురుపల్లిలో శుక్రవారం 6,012 మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందజేయనున్నట్లు AO సూర్యకుమారి గురువారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. PM కిసాన్‌ కింద రూ. 1.03 కోట్లు, రాష్ట్ర వాటా కింద రూ. 2.40 కోట్లు విడుదల కానున్నాయని తెలిపారు. స్థానిక MLA కిమిడి కళా వెంకటరావు చేతుల మీదుగా గరివిడిలో జరగనున్న కార్యక్రమంలో రైతులకు చెక్కులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

March 13, 2026 / 06:13 AM IST

‘శతశాతం ఇంటి పన్నుల వసూళ్ళకు దృష్టి సారించాలి’

VZM: శత శాతం ఇంటి పన్నులు వసూలు చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శులకు భోగాపురం డిప్యూటీ MPDO గాయత్రి సూచించారు. గురువారం ముంజేరు గ్రామ పంచాయతీని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులను పరిశీలించి, ఇళ్ల పన్నులు ఎంత మేరకు వసూలు జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల యొక్క అసెస్మెంట్‌ నంబర్లు ఎంత మేరకు వేసారంటూ ఆరా తీశారు.

March 13, 2026 / 06:07 AM IST

సైబర్ నేరాలపై జాగ్రత్త: ఎస్సై

KRNL: సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మొబైల్‌ ఫోన్లలో వచ్చే వెబ్‌సైట్‌ లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని మంత్రాలయం ఎస్సై మల్లికార్జున పిలుపునిచ్చారు. మండలంలోని బూదూరులో సీఐ రామానుజులు ఆదేశాల మేరకు ఆయన సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాల బారిన పడితే వెంటనే 1930కి కాల్‌ చేసి సమాచారం అందించాలన్నారు.

March 13, 2026 / 06:05 AM IST

మద్యం తాగి వాహనాలు నడపవద్దు: ఎస్సై

NDL: నిబంధనలకు విరుద్ధంగా, మద్యం తాగి వాహనాలు నడిపుతూ పట్టుబడితే కఠినంగా చర్యలు తప్పవని మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి వాహనదారులను హెచ్చరించారు. గురువారం రాత్రి గాజులపల్లె పరిధిలోని మెట్ట వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పది మందికి జరిమానాలు విధించారు. రోడ్డు నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.

March 13, 2026 / 06:02 AM IST

నేడు గోవిందమాంబ గురుపూజమహోత్సవం

KDP: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ధర్మపత్ని శ్రీ గోవింద మాంబ అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవం శుక్రవారం బ్రహ్మంగారి మఠంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రిస్వామి తెలిపారు. ప్రభాతసేవ, పంచామృతాభి షేకం, ద్వారపూజ, గ్రామోత్సవం పలు కార్యక్ర మాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారన్నారు.

March 13, 2026 / 06:02 AM IST

7.5 కేజీల గంజాయితో కేరళ వ్యక్తి అరెస్ట్

SKLM: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేరళకు చెందిన వ్యక్తిని లావేరు పోలీసులు అరెస్ట్ చేశారు. లావేరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ మేరకు అనుమానస్పదంగా ఉన్న అబ్దుల్ రవూఫ్‌ను తనిఖీ చేయగా, అతని నుంచి 7.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అవతారం గురువారం సాయంత్రం తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు.

March 13, 2026 / 06:01 AM IST

బాలుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష

ATP: శెట్టూరు మండలం తిప్పనపల్లిలో 2022లో జరిగిన బాలుడి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. భూ తగాదాల నేపథ్యంలో విష్ణువర్ధన్ అనే 11 ఏళ్ల బాలుడిని చిత్తప్ప, ఈరన్న, మురుకుందప్ప కలిసి హత్య చేశారు. కేసును విచారించిన జిల్లా జడ్జి భీమారావు నిందితులకు జీవితఖైదుతో పాటు జరిమానా విధిస్తూ గురువారం సంచలన తీర్పు ఇచ్చారు.

March 13, 2026 / 06:00 AM IST