• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘మోదీ ప్రభుత్వ కార్మిక వర్గంపై దాడి తీవ్రతరం చేసింది’

W.G: దేశంలో మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చాక కార్మిక వర్గం పైన దాడి తీవ్రతరం చేసిందని వామపక్ష నాయకులు ఆరోపించారు. సోమవారం ఏలూరులో ప్రదర్శనలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 12 గంటల పనివిధానాన్ని ఆమోదించటం పట్ల రాష్ట్ర సహాయ కార్యదర్శియు వెంకటేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

October 13, 2025 / 06:46 PM IST

ఎక్సైజ్ సీఐకు వినతిపత్రం అందజేసిన వైసీపీ శ్రేణులు

కృష్ణా: సీఎం జగన్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న కల్తీ మద్యం తయారీ, విక్రయాలపై నిరసనగా పామర్రు వైసీపీ శ్రేణులు శాంతియుతంగా సోమవారం నిరసన చేపట్టారు. మొవ్వ మండలంలోని మొవ్వ గ్రామంలో గల డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ సీఐకు వినతిపత్రం అందజేశారు.

October 13, 2025 / 06:45 PM IST

దేవమ్మచెరువులో రీసర్వే ఫీల్డ్ వెరిఫికేషన్

NLR: సీతారామపురం మండలం దేవమ్మచెరువులో రీసర్వే ఫీల్డ్ వెరిఫికేషన్ సోమవారం జరిగింది. ఆత్మకూరు డివిజన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారులు పి. శ్రీనివాస్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాస్ శర్మ పరిశీలించారు. తప్పులు లేకుండా రీసర్వే చేయాలని, ఏ రైతుకూ నష్టం జరగకుండా చూడాలని సర్వే అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా ఎంఎస్ శ్రీకాంత్, సర్వేయర్లు నిఖిల్, పాల్గొన్నారు.

October 13, 2025 / 06:45 PM IST

బాలి యాత్రకు ఎమ్మెల్యే రవికుమార్‌కు ఆహ్వానం

SKLM: శ్రీముఖలింగం బాలియాత్ర 2025 నిర్వహణ కమిటీ సభ్యులు సోమవారం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌‌ను కలిసి నవంబర్‌ 9న జరగబోయే బాలియాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలియాత్ర విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించడానికి కృషి చేస్తానని తెలియజేశారు.

October 13, 2025 / 06:42 PM IST

‘తాటిపూడి కలను సాకారం చేసిన మహనీయుడు బుచ్చి అప్పారావు’

VZM: తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి, ఈ ప్రాంత ప్రజల ఏళ్లనాటి కలను సాకారం చేసిన మహనీయుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. రిజర్వాయర్ సమీపంలో ఏర్పాటుచేసిన బుచ్చి అప్పారావు విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ ప్రాంత ప్రజలకు త్రాగు, సాగు నీరు అందుతుందని, ఈ ఘనత అయనదే అన్నారు.

October 13, 2025 / 06:34 PM IST

మంత్రి కేశవ్‌ను కలిసిన కొవ్వలి

W.G: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను అమరావతిలో సోమవారం నరసాపురానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కొవ్వలి ఫౌండేషన్ ఛైర్మన్ కొవ్వలి యతిరాజా రామ్మోహన్నాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. పయ్యావుల కేశవ్ కు రామ్మోహన్నాయుడు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇరువురు పలు రాజకీయ అంశాలపై చర్చించారు.

October 13, 2025 / 06:31 PM IST

జిల్లాలోని పలు ఆర్టీసీ షాపుల టెండర్లకు ఆహ్వానం

సత్యసాయి: జిల్లాలో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, హిందూపురం, పెనుగొండ తదితర ఆర్టీసీ బస్టాండ్‌లలో ఖాళీగా ఉన్న షాపులను అద్దెకు ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఆసక్తిగల వ్యాపారులు 18వ తేదీన పుట్టపర్తి రీజనల్ మేనేజర్ కార్యాలయంలో టెండర్ ఫారాలను సమర్పించవచ్చని, అదే రోజు బాక్స్‌ తెరిచి కేటాయింపుల ఫలితాలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

October 13, 2025 / 06:26 PM IST

విశాఖ‌లో బిగ్‌బాస్ శ్రీ‌జ‌కు ఘ‌న స్వాగ‌తం

VSP: బిగ్ బాస్ రియాలిటీ షోలో ‘శివంగి’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాఖ‌కు చెందిన దమ్ము శ్రీజకు సోమవారం విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. శ్రీజ తల్లిదండ్రులు దమ్ము శ్రీనివాసరావు, లావణ్య దంపతులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద ఎత్తున విమానాశ్రయంలో హాజరై శ్రీజను ఘనంగా స్వాగతించారు.

October 13, 2025 / 06:25 PM IST

ప్రజా ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలి : ఎస్పీ

KKD: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ మొత్తం 65 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూ తగాదాలు – 22, కుటుంబ కలహాలు – 20, ఇతర విభాగాలకు చెందినవి – 23 ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ప్రతి ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలన్నారు.

October 13, 2025 / 06:25 PM IST

ఉపాధ్యాయులతో సెల్ఫీ దిగిన ఎమ్మెల్యే

PLD: నిరుద్యోగులకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఎమ్మెల్యే చదలవాడ అన్నారు. నరసరావుపేటలో మెగా DSC ద్వారా నియమించబడిన కొత్త ఉపాధ్యాయులతో ఆయన సెల్ఫీ దిగి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తికి మరింత వన్నె తెచ్చేలా నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన నూతన ఉపాధ్యాయులకు సూచించారు.

October 13, 2025 / 06:23 PM IST

1200 పడకల ఆసుపత్రిగా మారుస్తాం: ఎమ్మెల్యే

ATP: అనంతపురం సర్వజనాసుపత్రిని 1200 పడకల ఆసుపత్రిగా మారుస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో 560 పడకలు ఉన్నాయని, వీటిని 1200 పడకలక పెంచుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే డీపీఆర్‌ను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. సామాన్యులకు మెరుగైన వైద్యం అందించాలన్నదే లక్ష్యమని అన్నారు.

October 13, 2025 / 06:18 PM IST

పొన్నూరులో పర్యటించిన ప్రపంచ బ్యాంకు బృందం

GNTR: పొన్నూరులోని నిడుబ్రోలులో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ప్రపంచ బ్యాంకు బృందం సందర్శించింది. రోగులకు అందుతున్న సేవలను సూపరింటెండెంట్ డా.ఫిరోజ్ ఖాన్, వైద్యులను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని మౌలిక వసతులు, ల్యాబ్, ఎక్సరే, జనరల్ వార్డ్, ఓపీ గది, తదితరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

October 13, 2025 / 06:17 PM IST

రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుంది: ఏకుల

అన్నమయ్య: రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి అన్నారు. రాజంపేట పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద సోమవారం వైసీపీకి చెందిన మహిళలు నిరసనలు చేపట్టారు. 100 రూపాయలకే మద్యం ఇస్తామని ఎన్నికల్లో చెత్త హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇది అన్నారు.కల్తీ మద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు.

October 13, 2025 / 06:15 PM IST

ఆర్టీసీ పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలి: కలెక్టర్

PPM: మన్యం జిల్లాలోని ఆర్టీసీ బస్ స్టాండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతిరోజూ పరిశీలన చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య కార్యక్రమం చేపట్టక ముందు తరువాత ఫోటోలు తీయాలన్నారు.

October 13, 2025 / 06:13 PM IST

మాదకద్రవ్య వినియోగంతో జీవితాలు సర్వనాశనం: ఎస్సై

SKLM: మాదకద్రవ్యాల వినియోగంతో జీవితాలు నాశనం అయిపోతాయని ట్రైనీ ఎస్సై కొండపల్లి ప్రమీల దేవి తెలిపారు. సోమవారం నరసన్నపేటలోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నేటి తరం యువత చదువు పట్ల తగిన శ్రద్ధ చూపాలని, లేనిపోని వ్యసనాల పట్ల దృష్టి సారిస్తే జీవితాలు నిర్వీర్యం అయిపోతాయని పేర్కొన్నారు.

October 13, 2025 / 06:12 PM IST