ELR: చింతలపూడి మండలం నామవరంలో ఎక్సైజ్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. గొగ్గులోతు రంగమ్మ వద్ద 2 లీటర్లు నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐలు అబ్దుల్ ఖలీల్, జగ్గారావు, సిబ్బంది ఉన్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.
W.G: తుపాను, అధిక వర్షాల ప్రభావం వల్ల కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు మొగల్తూరు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఈనెల 26వ నుంచి 31 వరకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మొగల్తూరు తహసీల్దార్ రాజ్ కిషోర్ తెలిపారు. కంట్రోల్ రూమ్ వద్ద రెవెన్యూ సిబ్బందిని 24 గంటలో పాటు పాత్రి పదికన నియమించినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
GNTR: గుంటూరులోని పలు ప్రాంతాల్లో పోలీసులు శనివారం ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని సీఐ వీరయ్య తెలిపారు. మద్యం తాగి నడిపితే కఠిన చర్యలు తప్పవని, ప్రతి ఒక్కరూ లైసెన్స్, ఆర్‌సీ బుక్ కలిగి ఉండాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలన్నారు.
ATP: రాయదుర్గం పట్టణం నుంచి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ మాధవి బస్సును సీజ్ చేసినట్లు ఆర్టిఓ విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సులను విస్తృతంగా తనిఖీ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
NLR: కర్నూలు జిల్లా బస్సు దుర్ఘటన మరవక ముందే, పొదలకూరు మండలంలోని మర్రిపల్లి వద్ద మరో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బెంగుళూరు కి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శనివారం రాత్రి అకస్మాతగా పొగలు వచ్చాయి. దీంతో బస్సును ఆపివేశారు. ప్రయాణికులు వెంటనే అందులో నుంచి బయటపడినట్లు తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
SKLM: సారవకోట మండలం వడ్డినవలస గ్రామంలో కార్తీక మాసం 5వ రోజు ఆదివారం భక్తుల రద్దీతో కనిపించింది. తెల్లవారుజాము వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. తెల్లవారే సరికి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఇది కార్తీకమాసానికి నిదర్శమని అంటున్నారు.
TPT: తిరుపతి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బాయిలర్ కోడి కిలో రూ.150, మాంసం రూ.280, స్కిన్ లెస్ రూ.300 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.240 చొప్పున అమ్ముతున్నారు. కేజీ మటన్ రూ.900గా ఉంది. కార్తీక మాసంలో ధరలు పెరగడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
E.G: జగ్గంపేట నియోజకవర్గంలో నేడు పర్యటనంచనున్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్‌పర్సన్ జె ఎస్ జవహర్. ఆదివారం ఉదయం 11 గంటలకు జగ్గంపేట మండలం సీతారం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, జగ్గంపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కోడూరు సత్యనారాయణ ఇంటికి చేరుకుంటారు. దళిత నాయకుల సమావేశంలో ఆయన పాల్గొంటారు.
VZM: కొత్తవలస మండలం వీరభద్రపురం పంచాయతీ ములగపాకవానిపాలెంలో ఒకే ఇంటిపేరుతో సుమారు తొంబై కుటుంబాలు ఆ గ్రామంలో ఉన్నాయి. కాగా శనివారం నాగులచవితి సందర్బంగా వీరంతా ఒకే పుట్టలో పాలు పోశారు. ఇదే గ్రామానికి చెందిన దాసరి కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పొట్నూరు రత్నాజీ, కొత్తవలస పి.ఎం.ఎల్. కాంప్లెక్స్ వేంకటేశ్వర హాస్పిటల్ అధినేత డా. పీవీ. రాజు ఆ గ్రామానికి చెందినవారే.
E.G: ఉచిత వెరికోస్ వీన్స్ వైద్య శిబిరాలు గోకవరం మండల కేంద్రంలో గల ఎంపీపీ స్కూల్ ఆవరణలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో పాలాడి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో రూ. 5 వేల విలువగల రక్తనాళాల సర్జరీ కన్సలేషన్స్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.
SKLM: విజయవాడలో ఈనెలలో జరిగే ఆర్చరీ పోటీలకు ఆదివారం ఎంపికలు జరగనున్నాయని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.చిట్టిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్చరీ పోటీలను స్థానిక ఆర్చరీ గ్రౌండ్‌లో ఆదివారం ఉ. 10 గంటలకు పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఆధార్ కార్డుతో పాటు 4 పాస్ ఫొటోస్, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని అన్నారు.
GNTR: గుంటూరులోని పట్టాభిపురం పీఎస్ పరిధిలోని కృష్ణనగర్ కుందుల రోడ్డులో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న కొరిటెపాడుకు చెందిన సురేష్‌ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్‌కు తీవ్ర గాయాలై, ఒక కాలు పూర్తిగా తెగిపోయింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం: చీమకుర్తిలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు మొంథా తుపానుపై మండల స్థాయి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనునట్లు తహసీల్దార్ బ్రహ్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్ పాల్గొంటారని ఆయన తెలిపారు. జరగబోయే సమావేశానికి మండల స్థాయి అధికారులు హాజరుకావాలన్నారు.
SS: పుట్టపర్తి పట్టణంలోని గోకులం ప్రాంత నివాసులు ప్రతి ఆదివారం వేకువ జామున భక్తి వాతావరణంలో నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. నేడు ఉదయం ఐదు గంటలకు సుప్రభాతం అనంతరం భక్తులు సమూహంగా సంకీర్తనలో పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం స్థానికుల భక్తి శ్రద్ధలకు నిలువెత్తు నిదర్శనంగా మారిందని నిర్వాహకులు తెలిపారు.
ATP: గుంతకల్లుకు చెందిన ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. పట్టణంలోని అభిపీఠా కాలనీకి చెందిన షేక్ తాయిబ్లీ, గంగానగర్‌కు చెందిన సయ్యద్ హాజీని చోరీ కేసులో అదువులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద రూ.250 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.