VZM: ఈనెల 16 నుంచి జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని DEO మాణిక్యంనాయుడు శుక్రవారం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాలు లేని పాఠశాలలు ఉదయం 8 నుంచి 12:30 వరకు నిర్వహించి మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను పంపించాలని సూచించారు. పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు భోజనం అనంతరం ఒంటి గంట నుంచి 5 వరకు నిర్వహించాలన్నారు.
NTR: విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఎమ్మెల్యే బోండా ఉమా నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆనందంగా ఉంటే సమాజమంతా సుఖసంతోషాలతో ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం రైతుబంధు సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, వైసీపీకు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు.
శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి మైదానంలో ఈనెల 15న జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు జరగనున్నాయని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బీఏ దేవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు బాలబాలికలకు వేర్వేరుగా ఎంపికలు ఉంటాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనదలచిన వారు జనన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు నేరుగా సంప్రదించాలన్నారు.
KDP: జిల్లా సి.కె దిన్నె సర్కిల్ పరిధిలో సి.ఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, అధిక శబ్దం చేసే సైలెన్సర్లు ఉపయోగిస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.
W.G: రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ -డి పరీక్షకు సిద్ధమవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నాగరాణి తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 23లోపు ఏలూరులోని బీసీ స్టడీ సర్కిల్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 86861 80018, 90302 11920 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
KDP: లింగాల మండల పరిధిలోని ఇంటి ఓబయ్య పల్లిలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. అరటి తోటలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో రూ.50 వేల విలువైన అరటి పంట దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే పులివెందుల అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి సమయస్ఫూర్తితో రూ.3 లక్షల విలువైన మిగిలిన పంటను కాపాడగలిగారు.
ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా వద్ద సింగరాయకొండ సీఐ హజరతయ్య రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై వాహనదారులకు, మహిళలకు శుక్రవారం అవగాహన కల్పించారు. వాహనాలకు సరైన పత్రాలు లేని వారిని, డ్రైవింగ్ లైసెన్సులు లేని వారిని, హెల్మెట్‌లు ధరించని వారిని గుర్తించి వారికి జరిమానా విధించారు. అనంతరం వారికి రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై కౌన్సెలింగ్ ఇచ్చారు.
ELR: రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్-డి పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నాగరాణి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 23లోగా ఏలూరులోని బీసీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8686180018, 9030211920 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
BPT: పిట్టలవానిపాలెంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొన్నారు. రైతులు ఆర్థికంగా నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నాయని తెలిపారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.
NDL: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనార్థమై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుక్రవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. దేవస్థానం అతిథి గృహం వద్ద గవర్నర్‌కు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తదితరులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. నేడు ఉదయం స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకోనున్నారు.
అన్నమయ్య: వాల్మీకిపురం జూనియర్ సివిల్ కోర్టులో శనివారం నిర్వహించే జాతీయ లోక్అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి గురు అరవింద్ తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు రుణాలు తదితర రాజీ కుదిరే కేసులను లోక్అదాలత్ ద్వారా త్వరగా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. పోలీసు అధికారులు,న్యాయవాదులు సహకరించి ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని కోరారు.
KRNL: ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.8,700, మధ్యస్థ ధర రూ.6,900, కనిష్ఠ ధర రూ.3,360కు వ్యాపారులు కొన్నారు. మార్కెట్‌కు 310 మంది రైతులు 9,937 వేరుసెనగ బస్తాలు అమ్మకానికి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,600, మధ్యస్థ ధర రూ.5,600, కనిష్ఠ ధర రూ. 5,033 పలికినట్లు పేర్కొన్నారు.
సత్యసాయి: కదిరి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు అదనపు బస్సులు నడపడంతో ఆర్టీసీకి రూ.89 లక్షల ఆదాయం సమకూరింది. డిపోలోని 105 బస్సులతో పాటు భక్తుల రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులకు రవాణా సౌకర్యం కల్పించడమే కాకుండా, సంస్థకు భారీగా లాభాలు చేకూరాయి.
CTR: పలమనేరులోని 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఇవాళ పలమనేరు, పలమనేరు రూరల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ అర్జున ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
కృష్ణా: రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గుడ్లవల్లేరులో ఎస్సై సత్యనారాయణ నిన్న ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని రకాల వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సీ (RC), పొల్యూషన్ ఇన్‌షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.