• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా నిరసన

అన్నమయ్య: రైల్వే కోడూరులో వామపక్షాల ఆధ్వర్యంలో అంబేద్క‌ర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. ఈ మేరకు దేశ ప్రయోజనాలు, సార్వభౌమత్వాన్ని కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అమెరికా విధిస్తున్న అధిక సుంకాలు, వీసాలపై కఠిన నిబంధనలు విద్యార్థులు, రైతులు, కార్మికులకు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, దీనిపై మోడీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

September 8, 2025 / 10:08 AM IST

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం రూ.1668 కోట్లు విడుదల

అన్నమయ్య: ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న శ్రామికుల వేతన బకాయిలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,668 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో మే 15 నుండి ఆగస్టు 15 వరకు చెల్లించాల్సిన బకాయిలు తీరిపోతాయని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో మిగిలిన చెల్లింపుల కోసం దాదాపు రూ.140 కోట్లు అవసరమని పేర్కొన్నారు. కాగా, ఈ నగదు నాలుగు రోజుల్లోగా శ్రామికుల ఖాతాల్లో జమ కానుంది.

September 8, 2025 / 10:05 AM IST

గుంటూరు జీజీహెచ్‌లో 500 పడకల బ్లాకు

GNTR: గుంటూరు జీజీహెచ్‌లో మాతా, శిశు వైద్య సేవలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.86 కోట్లతో నిర్మిస్తున్న 500 పడకల బ్లాకులో వైద్య పరికరాల కొనుగోలుకు ఇటీవల మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ చర్యలతో గర్భిణులు, నవజాత శిశువుల మరణాలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

September 8, 2025 / 10:05 AM IST

డ్రై ఫ్రూట్స్ అలంకరణలో స్వయంభుజంబుకేశ్వరుడు

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జయంబుకేశ్వరుడికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే పంచామృత కుంకుమార్చనలు చేపట్టి స్వామి మూల విరాట్‌పై డ్రై ఫ్రూట్స్‌తో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. నిన్నటి దినం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూతపడిన ఆలయం ఎక్కువ జామున తలుపులు తీసి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు.

September 8, 2025 / 10:04 AM IST

చిత్తడిగా మారిన మట్టి రోడ్లు

AKP: నర్సీపట్నంలో కురుస్తున్న వర్షాలకు వీధి రోడ్లు చిత్తడిగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా కొత్తవీధి తదితర ప్రాంతాల్లో రోడ్లు చిత్తడిగా మారడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మట్టి రోడ్లు కారణంగా చిన్నపాటి వర్షానికి ఇబ్బందులు పడుతున్నామని సోమవారం ఈ ప్రాంతీయులు అంటున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్లను సీసీ రోడ్లుగా మార్చాలని కోరుతున్నారు.

September 8, 2025 / 10:02 AM IST

డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్న బసవన్న చెరువు

SKLM: సారవకోట మండలం చీడిపూడిలో ఉన్న బసవన్న చెరువు డంపింగ్ యార్డ్‌ను తలపిస్తుంది. స్థానిక పంచాయితీలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని స్థానిక గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామస్తులు పలు కార్యక్రమాలకు బసవన్న చెరువును ఉపయోగించుకుంటున్నారని ఈ క్రమంలో వ్యర్ధాలను వేయడం వలన పరిశుభ్రత కోల్పోయే పరిస్థితి వస్తుందని వివరించారు.

September 8, 2025 / 09:55 AM IST

విద్యుత్ సరఫరాకు అంతరాయం ఎన్ని గంటలంటే..?

SKLM: కవిటి మండలంలోని బొరివంక, మాణిక్యపురం 11కెవి ఫీడర్లో నిర్వహణ పనులు నిమిత్తం ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈ.ఈ యగ్నేశ్వరరావుకు తెలిపారు. బొరివంక, బొగిడియాపుట్టుగ, మునిపుట్టుగ, దూగానపుట్టుగ, మాణిక్యపురం, బల్లిపుట్టుగ, వరక, కుసుంపురం గ్రామాలకు వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.

September 8, 2025 / 09:50 AM IST

నిరుపయోగంగా వాటర్ ప్లాంట్ .. ఇబ్బందుల్లో ప్రజలు

ATP: కుందుర్‌లో మండల కేంద్రంలో పదేళ్ల క్రితం ఆర్డీటీ స్వచ్చంద సంస్థ లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. కాగా, వాటర్ ప్లాంట్ ఐదు నెలలుగా నిరుపయోగంగా ఉంది. పనిముట్లు చెడిపోవడంతో అధికారులు మరమ్మతులు చేయించకుండా మూసివేయడంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నిరుపయోగంగా వాటర్ ప్లాంట్‌ను పునరుద్ధించాలని కోరుతున్నారు.

September 8, 2025 / 09:49 AM IST

నంది కోట్కూరులో చెక్కులు పంపిణీ కార్యక్రమం

NDL: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులు MLA జయసూర్య నేడు నంది కోట్కూరులో పంపిణీ చేయనున్నారు. ఉదయం 10.00 గంటలకు పట్టణంలోని BRR నగర్, కోట వీధి, రాముల వీధి, బొంగుల బజార్, గాంధీ నగర్ సుబ్బారావు పేట, సాయిబాబా పేట, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో పంపిణీ చేస్తారని కార్యాలయం సమాచార ప్రతినిధి తెలిపారు. ఈ మేరకు కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.

September 8, 2025 / 09:47 AM IST

విలేఖరికి బెదిరింపులు

NLR: దగదర్తి మండలంలో ఓ నాయకుడు అక్రమాలను ప్రజలకు తెలియపరిచే విధంగా ఓ దినపత్రికలో వార్త రాసినా విలేకరిని చంపేస్తామంటూ బెదిరింపులు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆ విలేఖరి దగదర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజల కోసం పనిచేసే విలేకరులు.. ఎవరినైన ప్రశ్నించే హక్కు ఉంటుందని వివరించారు.

September 8, 2025 / 09:47 AM IST

పరిటాల శ్రీరామ్‌ను సన్మానించిన మున్సిపల్ కార్మికులు

సత్యసాయి: కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ ఇంజినీరింగ్ సెక్షన్ ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం ధర్మవరం పట్టణంలో మున్సిపల్ కార్మికులు టీడీపీ ఇన్‌ఛార్జ్  పరిటాల శ్రీరామ్‌ను సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. ధర్మవరం మున్సిపల్ ఇంజినీరింగ్ సెక్షన్ యూనియన్ అధ్యక్షులు బొగ్గు నాగరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

September 8, 2025 / 09:45 AM IST

ద్వారకాతిరుమలలో 9.6మి.మీ వర్షపాతం నమోదు

ELR: గడచిన 24 గంటల్లో జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను సోమవారం అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 28 మండలాల్లో కేవలం ఒక్క ద్వారకాతిరుమల మండలంలోనే 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. మిగిలిన 27 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదన్నారు. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం సుమారు అరగంట పాటు ద్వారకాతిరుమలలో భారీ వర్షం కురిసింది.

September 8, 2025 / 09:44 AM IST

తెరుచుకున్న యాగంటి క్షేత్రం

NDL: బనగానపల్లె మండలంలో ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం చంద్రగ్రహణం అనంతరం సోమవారం తెల్లవారుజామున తలుపులు తెరిచారు. వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రోక్షణ అనంతరం స్వామికే రుద్రాభిషేకం పంచామృతాభిషేకం పుష్పలంకరణతో కుంకుమార్చన మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

September 8, 2025 / 09:39 AM IST

నారాయణస్వామి ఆలయాన్ని తెరిచిన పూజలI

ప్రకాశం: చంద్రశేఖరపురం(M)లోని మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయాన్ని సోమవారం తెల్లవారుజామున తెరిచి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఆలయాన్ని మూసేసిన అధికారులు సోమవారం ఆలయ ఈవో గిరిరాజు నరసింహ బాబు, అర్చకులు మహంకాళి నరసింహారావు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

September 8, 2025 / 09:39 AM IST

విశాఖ‌లో మృత‌దేహం క‌ల‌క‌లం

VSP: విశాఖపట్నం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లిపురం నీలమ్మ వేపచెట్టు ప్రాంతానికి చెందిన బొంత అప్పలరాజు (55) అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమ‌వారం ఉద‌య స్థానికులు మృత‌దేహాన్ని క‌నుగొన్నారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

September 8, 2025 / 09:32 AM IST