సత్యసాయి: కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ ఇంజినీరింగ్ సెక్షన్ ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం ధర్మవరం పట్టణంలో మున్సిపల్ కార్మికులు టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌ను సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. ధర్మవరం మున్సిపల్ ఇంజినీరింగ్ సెక్షన్ యూనియన్ అధ్యక్షులు బొగ్గు నాగరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.