KDP: చంద్రగ్రహణం సందర్భంగా కడప జిల్లాలోని అన్ని ఆలయాలు మూత పడిన విషయం తెలిసిందే. గ్రహణం వీడటంతో ఇవాళ తెల్లవారుజామున ఆలయాలు తెరిచారు. ఇందులో భాగంగా ఒంటమిట్ట కోదండరామాలయంలో టీటీడీ అర్చకులు ఆలయ శుద్ధి చేశారు. తర్వాత సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. కాగా, జిల్లాలోని ఇతర ఆలయాల్లోనూ దర్శనాలు తిరిగి మొదలయ్యాయి.