కాకినాడ: రాష్ట్రంలో నిరుద్యోగులను గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం కౌశలం సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కౌశలం సర్వే సక్రమంగా జరగడం లేదని తెలుసుకున్న కమిషనర్ భావన 826 మంది సచివాలయ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు అందజేశారు. ఇక నుంచైనా సిబ్బంది ఈ సర్వే చేపట్టడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.