AP: లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 12కి వాయిదా వేసింది. అలాగే, ఈకేసులో ఏ8 నిందితుడిగా ఉన్న చాణక్య బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది. ఈ కేసులో రూ.11 కోట్లు సీజ్ చేయబడిన అంశంపై కూడా విచారణ జరిగింది.