NZB: ఫిజియోథెరపీ వల్ల ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. సోమవారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో NZB ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ పాల్గొన్నారు.