GNTR: పెదకాకాని మండలం యాదవపాలెంకు చెందిన దానబోయిన కోటేశ్వరమ్మ తన భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిందని ఆరోపించారు. సోమవారం ఆమె గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ, ఎస్పీ సతీశ్లను కలిసి, నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కుట్రపూరితంగా ఈ రిజిస్ట్రేషన్ జరిగిందని ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రశ్నించగా తమపై దాడులు జరుగుతున్నాయని, తనకు రక్షణ కల్పించాలని కోరారు.