AP: ఎన్డీయే కూటమితో టీడీపీ పొత్తు 2029 తర్వాత కూడా కొనసాగుతుందని మంత్రి లోకేష్ వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతిస్తామని తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి అయినప్పటికీ ‘భారత్ ఫస్ట్’ అనే నినాదంతో తమ పార్టీ ముందుకుసాగుతోందని చెప్పారు.