CTR: తల్లితండ్రులు చేసిన లక్ష రూపాయలు అప్పు కోసం పిల్లలను సంవత్సరం పాటు సిమెంటు ఇటుకల ఫ్యాక్టరీలో నిర్బంధించి వేధిస్తున్న ఘటన గంగాధర నెల్లూరు మండలంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని పూనేపల్లికి చెందిన నందిని ముగ్గురు పిల్లలను విడిపించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీవో, ఎమ్మార్వో శ్రీనివాసులు, ఏఎస్ఐ మురళి పాల్గొన్నారు.