NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవాళ రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలోని నల్గొండ, చిట్యాల, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్నగర్, సూర్యాపేట ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.