JGL: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల గురుకులంలో విద్యార్థినులకు సోమవారం రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మిషన్ శక్తి, జిల్లా మహిళా సాధికారత బృందం ఈ 10 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భవానీనగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ సదస్సు నిర్వహించారు. రుతుక్రమం సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలను చెప్పారు.