కడప: మైదుకూరు మున్సిపాలిటీ శెట్టివారిపల్లెకు చెందిన దివ్యాంగుడు దుత్తలూరు నాగరాజు మూడు చక్రాల వాహనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. స్థానికులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చి బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిల్‌ను సోమవారం బాధితుడికి అందజేశారు.