RR: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను షాద్నగర్ పోలీసు అరెస్టు చేశారు. పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన వెంకటేశ్వర్లు బైక్ జూలై 11న దొంగతనమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలతో శివ, రామచందర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను సోమవారం రిమాండ్కు తరలించారు.