‘మిరాయ్’ ప్రీ రిలీజ్ వేడుకలో మంచు మనోజ్ భావోద్వేగంగా మాట్లాడాడు. తాను నటించిన చిత్రాలు విజయం సాధించినా, విఫలమైనా అభిమానులు తన వెంటే ఉన్నారని చెప్పాడు. తాను చెట్టు పేరు చెప్పి మార్కెట్లో అమ్ముడుపోయే కాయను కాదని.. అభిమానుల మనోజ్‌ని అని అన్నాడు. అభిమానుల రూపంలో తనకు ఇంత పెద్ద కుటుంబం ఏర్పడటం.. గత జన్మలో తాను చేసుకున్న అదృష్టమని, తల్లిదండ్రుల ఆశీస్సులని పేర్కొన్నాడు.