కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు PACSలో సోమవారం రైతులకు పాస్బుక్ ఆధారంగా 15 టన్నుల యూరియాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PACS చైర్మన్ ఆరుమళ్ళ వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా అందిస్తామని, ఎవరు ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు. PACSను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ఎం. బంగారు రాజు తనిఖీ చేశారు.