ASR: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమం సోమవారం కొత్తూరు గ్రామ సచివాలయంలో ఘనంగా జరిగింది. కొత్తూరు ఉపసర్పంచ్ గాలి నరసింహమూర్తి, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు డుంబారి కృష్ణ సుమారు 150 స్మార్ట్ రేషన్ కార్డులను లబ్దిదారులకు అందించారు. రేషన్ విధానంలో పారదర్శకత పెంచడానికి స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వారు తెలిపారు.