‘మిరాయ్’ ప్రీ రిలీజ్ వేడుకలో యాంకర్ సుమ, హీరో తేజ సజ్జాను పెళ్లి గురించి ప్రశ్నించింది. ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని తేజ సజ్జాను సుమ అడగింది. అందుకు తేజ తెలివిగా స్పందిస్తూ.. ”మిరాయ్’ సినిమాను పెద్ద హిట్ చేయండి. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను’ అని అన్నాడు. దీంతో అభిమానులు తేజ పెళ్లికి, సినిమా విజయానికి సంబంధం ఉందంటూ సరదాగా కామెంట్లు చేసుకుంటున్నారు.